Thursday, August 14, 2008

స్వడబ్బా

స్వడబ్బా....అసలు బ్లాగుకి ఏమి పేరు పెట్టాలా అని చించి చించి ఏవో మూడు నాలుగు పేర్లతో మొదలెట్టా. మనకి మామూలుగానే ఏదీ మొదటిసారి వర్కవుట్ కాదు కదా. అందుకే కాబోలు ఏ పేరూ దొరికిచావలేదు. ఇంతలో మా అమ్మ చిన్నప్పుడు చెప్పిన ఒక జోకు గుర్తుకొచ్చింది. అదేమిటంటే డబ్బాలు మూడు రకాలు. ఒకటి స్వడబ్బా, రెండు పర డబ్బా, మూడు పరస్పరడబ్బా.అవేమిటో నేను వేరే చెప్పనక్కర లేదనుకొంటా. నావరకూ వచ్చేసరికి ఎలాగూ స్వడబ్బాయే గనక అదేపేరుతో సిద్దమైపోయా.
ఏదో నా ఆత్మఘోషని కొంచెం హాస్యస్ఫొరకంగా చెప్పుకోవచ్చుకదా అని ఈ ప్రయత్నం. గాలి గన్నారావు చెప్పినట్టు తప్పులుంటే మన్నిచండి (ఎలాగూ ఇంటర్నెట్ లో మొట్టికాయలు వెయ్యలేరు కనక). వీలైతే తప్పొప్పులు చెప్పండి. త్వరలోనే కలుస్తా.